
మాట్లాడుతున్న రాజారెడ్డి
● సీఐటీయూ అధ్యక్షుడు రాజారెడ్డి
శ్రీరాంపూర్(మంచిర్యాల): లేబర్ కమిషనర్ ఎదుట కార్మిక సంఘాలు, కంపెనీకి మధ్య జరిగిన అగ్రిమెంట్ల ఉత్తర్వులను యాజమాన్యం విడుదల చేయాలని సీఐటీయూ అధ్యక్షుడు టీ.రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆర్కే5 గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. కోలిండియాలో జరిగిన అగ్రిమెంట్లు అమలుకావడం లేదన్నారు. 2011లో అలవెన్సులపై ఐటీ మాఫీ చేసే ఒప్పందం అనంతరం క్యాడర్ స్కీం ఒప్పందాలను అమలు చేయలేదన్నారు. ఒప్పందాలు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించి ఏం లాభమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చేపట్టనున్న ‘చలో ఢిల్లీ’ యాత్రను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచి అధ్యక్షుడు మిడివెల్లి శంకర్, సెక్రటరీ భాగ్యరాజ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చంద్రశేఖర్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.