ఎనిమిది ఇసుక ట్రాక్టర్లు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎనిమిది ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

Mar 30 2023 12:24 AM | Updated on Mar 30 2023 12:24 AM

మంచిర్యాలలో పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు
 - Sakshi

మంచిర్యాలలో పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు

మంచిర్యాలక్రైం: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు మైనింగ్‌ ఏడీ బాలు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జామున మైనింగ్‌ సిబ్బందితో కలిసి గోదావరి సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్లను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

తాండూర్‌లో నాలుగు ...

తాండూర్‌(బెల్లంపల్లి): అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు మైనింగ్‌ ఏడీ బాలు తెలిపారు. తాండూర్‌ మండలం అచ్చులపూర్‌ శివారులోని వాగులో నుంచి కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తమకు అందిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement