అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వ శాఖల్లో అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఉద్యోగి పాటుపడాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. యాంటీ కరప్షన్ వీక్–2025ను పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించా రు. వారాంతం పాటు జరగను న్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సిద్ధం చేసిన యాంటీ కరప్షన్ అవగాహన వాల్‌పోస్టర్‌ను తన చాంబర్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలందరి మధ్య అవినీతిని నిర్మూలించేందుకు అవసరమైన అవగాహన, బా ధ్యత, పారదర్శకతను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. నిరంతర అవగాహన, నైతిక విలువలు, ప్రజల భాగస్వా మ్యం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో నిజాయితీ, సమగ్రత మరింత బలపడుతుందని చెప్పా రు. యాంటీ కరప్షన్ బ్యూరో, మహబూబ్‌నగర్ రేంజ్ ఈ వారంలో అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. అవినీతి కార్యకలాపాలను అరికట్టడం, ప్రజల్లో అప్రమత్తతను పెంచడం, అవినీతి రహిత పరిపాలన సమాజ ఆర్థికాభివృద్ధికి కీలకమని తెలియజేయడం ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. సీఐలు ఎస్‌ఏ ఖాదర్ జిలానీ, లింగస్వామి పాల్గొన్నారు.


