
మన్యంకొండ వెళ్తున్నాం..
నేను నా భార్యాపిల్లలతో కలిసి మన్యంకొండ వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు రాయచూర్ డెమోకు వచ్చాం. 6.50 గంటల నుంచి ఇక్కడే నిలిపివేశారు. రాత్రికి ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి. నా పిల్లలు నేను ఏమి తినాలో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఏమీ దొరకడం లేదు. – నర్సింహ, గద్వాల
తినడానికి ఏమీ లేవు
మదనాపురం– వనపర్తిలో రైల్వేస్టేషన్లో ట్రైన్ ఎక్కి గద్వాల వెళ్లాలన్న ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నాను. ఇప్పటికే రెండు రైళ్లను నిలిపివేశారు. ఏం జరిగిందో ఎవరూ చెప్పడం లేదు. నేను గద్వాల వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రాత్రికి తినడానికి కూడా ఏమీ లేవు. – విజయ్, మహబూబ్‌నగర్
మధ్యలో నిలిపేస్తే ఎలా..?
కొన్నేళ్ల క్రితం గొంతుకు శస్త్రచికిత్స అయ్యింది. అందుకే ఎక్కువ సేపు రైలులో ఉండలేనందున బస్సుకు వెళ్దామని పోతున్న. రైళ్ల రాకపోకలు ఇబ్బంది కలిగినప్పుడు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటది. ఇలా మధ్యలో రైళ్లు నిలిపివేస్తే ఎలా.? – శివమూర్తి, కర్నూలు
ఎంతసేపు ఉండాలో
భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరా. రైలు ఇక్కడ ఆపారు. ఏం జరిగిందో.. ఎందుకు ఆపారో తెలియక చాలాచేసు ఇబ్బంది పడ్డాం. గూడ్స్ పట్టాలు తప్పిందని ఇప్పుడే తెలుసుకున్నాం. ఇంకా ఎంతసేపు ఉండాలో తెలియడం లేదు. చిన్నపాప ఉన్నందున నా భార్య చీరతో ఊయల కట్టి పడుకోబెట్టాం. ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు తగినట్లుగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. – అమర్‌నాథ్, కర్నూలు
●

మన్యంకొండ వెళ్తున్నాం..

మన్యంకొండ వెళ్తున్నాం..

మన్యంకొండ వెళ్తున్నాం..

మన్యంకొండ వెళ్తున్నాం..