
పాత పింఛన్ విధానం అమలు చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: 2012లో ఎల్‌ఐసీలో నియామకమైన ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని సౌత్‌సెంట్రల్ జోన్ బీమా ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ తిరుపతయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్‌ఐసీలో ఎఫ్‌డీఐలను 100 శాతం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్‌డీఐని ఇండియాలోకి తీసుకురావడం వల్ల చాలా ప్రైవేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వస్తాయని అనుకున్నారని, కేవలం 25 కంపెనీలు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. బీమాలా అమెండ్‌మెంట్ బిల్లును ఈ వర్షకాలంలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదన్నారు. ఈ బిల్లును కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈనెల 9న జరిగే అఖిల భారత సమ్మెలో ఆలిండియా బీమా ఉద్యోగులు పాల్గొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో బీమా కార్పొరేషన్ ఎంప్లాయియిస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, డివిజన్ ఉపాధ్యక్షులు రాజేశ్వర్, మహబూబ్‌నగర్ బ్రాంచీ కార్యదర్శి కరుణాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.