
‘వైస్ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించండి’
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌యార్డు కార్యదర్శి భాస్కర్‌పై అకారణంగా చేయి చేసుకున్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు గురువారం కలెక్టర్ విజయేందిర బోయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పక్కనబెట్టి తన మాట వినాలని అధికారులపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదన్నారు. ప్రజాప్రతినిధిగా అధికారులకు సహకరించాల్సింది పోయి దాడికి పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. వీరికి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కూడా మద్దతు తెలిపింది. కాగా ఈ వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ సమయంలో ఎవరున్నారు.. సీసీ కెమెరాలు ఉన్నాయా.. లేదా, ఉంటే అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు సమాచారం. దాడి ఘటనపై ఎస్పీతో పాటు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని కలెక్టర్ ఉద్యోగ సంఘం నాయకులకు భరోసానిచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, కార్యదర్శి చంద్రనాయక్, ఉపాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, సహాయ కార్యదర్శి మల్లయ్య, వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, టీజీఓల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, కోశాధికారి టైటాస్‌పాల్, ఏఎంసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, వెంకట్రాములు, శ్రీశైలం ఉన్నారు.

‘వైస్ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించండి’