
ఫైల్ పట్టుకుని తిరుగుతున్నారు..
యూనివర్సిటీ ప్రతినెలా జీతాలు ఇచ్చేందుకు అధికారులు నిధుల కోసం ఫైల్ పట్టుకుని సెక్రెటరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో రూ.100 కోట్లపైనే ప్రతిపాదనలు పెడితే అందులో రూ.10 – 20 కోట్ల వరకే ఇస్తారు. అవి ఇచ్చేందుకు కూడా ఇబ్బందులే. యూనివర్సిటీలో భవనాలు విద్యార్థులు కట్టిన ఫీజులతో నిర్మించినవే.
– కుమారస్వామి, హెచ్‌ఓడీ, పొలిటికల్ సైన్స్
ఉపాధి అవకాశాలు కల్పించాలి..
యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉండే ఇండస్ట్రీస్‌లో పీయూ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేటి ఆలోచనలు చేసే విధంగా విద్యార్థుల కోసం ఇంక్యూబేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాయాలి. ఉపాధి శిక్షణలు వచ్చేందుకు నిధులు కేటాయించాలి.
– అర్జున్‌కుమార్, అధ్యాపకుడు, కామర్స్ డిపార్ట్‌మెంట్
ఉద్యోగ భద్రత కల్పించాలి..
యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. మాతో చదువుకుని గతంలో జేఎల్, డీఎల్‌గా కాంట్రాక్టు పద్ధతిలో చేరిన వారిని ప్రభుత్వం గతంలో రెగ్యులరైజ్ చేసింది. కానీ, యూనివర్సిటీలో పనిచేస్తున్న వారిని మాత్రం చేయలేదు. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే రెగ్యులర్ చేసి.. వేతనాలు పెంచాలి.
– భూమయ్య, అధ్యాపకుడు
●

ఫైల్ పట్టుకుని తిరుగుతున్నారు..

ఫైల్ పట్టుకుని తిరుగుతున్నారు..