
బక్రీద్ ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు
స్టేషన్ మహబూబ్‌నగర్: బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వక్ఫె రహెమానియా ఈద్గాను శనివారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17వ తేదీన పండుగ సందర్భంగా తాగునీటి వసతి, టెంట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. పట్టణంలో కులమతాలకతీతంగా పండుగలు చేసుకుంటారని చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ మాట్లాడుతూ ఈదుల్ అజ్‌హ ప్రార్థనలకు సంబంధించి ఏర్పాటు చేశామని, ముఖ్యంగా ఈద్గా మైదానంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈద్గా కమిటీ అధ్యక్షుడు తఖీ హుస్సేన్ మాట్లాడుతూ ఈ సారి ఈద్గాలో బక్రీద్ ఈదుల్ అజ్‌హ ప్రత్యేక నమాజును ఉదయం 8:30 గంటలకు నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి హాఫిజ్ ఇద్రీస్, నూరుల్ హసన్, గౌస్, పాష, సిరాజ్‌ఖాద్రీ, లక్ష్మణ్‌యాదవ్, ఖాజా అజ్మత్‌అలీ, మోసీన్, ఖాజపాష, కౌన్సిలర్ షేక్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.