
కష్టపడి పనిచేసి ఆర్టీసీకి మరింత ఆదాయం తేవాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉద్యోగులు మరింతగా కష్టపడి పనిచేసి డిపోకు మరింత ఆదాయం తేవాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వి.శ్రీదేవి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోలో గత నెలలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు పారితోషికం అందజేసి అభినందించారు. ఆర్‌ఎం మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. లక్షే లక్ష్యం మీద ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి ఆర్‌ఎం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు లక్ష్మీదుర్గ, శ్యామల, డిపో మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా బస్టాండ్‌లో ఆర్టీసీ కళాజాత బృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది.
ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వి.శ్రీదేవి