
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం..
డోర్నకల్: డోర్నకల్ సబ్ స్టేషన్ పరిధిలో గత నెల 14న ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతు చేస్తూ అసిస్టెంట్ లైన్‌మెన్ బి.క్రాంతికుమార్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహుపేటకు చెందిన బోగి నర్సయ్య, ఇందిర దంపతుల పెద్ద కుమారుడు క్రాంతికుమార్ ఏడేళ్ల క్రితం విద్యుత్‌శాఖలో చేరి డోర్నకల్‌లో విధులు నిర్వహిస్తూ చనిపోయాడు. 2019లో క్రాంతికుమార్‌కు వంశీలతతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్లు, రెండేళ్ల కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో క్రాంతికుమార్ మృతితో తల్లిదండ్రులతోపాటు తన పిల్లలు, భార్య రోడ్డున పడ్డారు. కాగా, తండ్రి కనిపించకపోవడంతో చిన్నారులు నిత్యం నాన్న.. నాన్న అంటూ క్రాంతికుమార్‌ను కలువరిస్తున్నారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.