
కేయూ స్నాతకోత్సవ రిహార్సల్స్
కేయూ క్యాంపస్: ఈ నెల 7వ తేదీన జరగనున్న కేయూ స్నాతకో త్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రిహార్సల్స్ చేశారు. పలువురు పాలకమండలి సభ్యులు, వివిధ విభాగాల డీన్లు, కమిటీల కన్వీనర్లు, సభ్యులు, ఇతర అధికారులు స్నాతకోత్సవ రిహార్సిల్స్ చేశారు. కొందరు విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానంపై కూడా రిహార్సల్స్ చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ రిహార్సల్స్ ద్వారా లోటు పా ట్లు తెలుసుకుని స్నాతకోత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు. కా ర్యక్రమంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
6న కేయూకు పనిదినం..
ఈ నెల7వ తేదీ కేయూ స్నాతకోత్సవం నేపథ్యంలో 6న (ఆదివారం) అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థ్ధులకు వర్కింగ్ డేగా పరిగణిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ రోజుకు బదులు అక్టోబర్ 4వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. కాగా, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు క్యాంపస్‌లోని పలు చోట్ల క్లీన్‌అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
రైతుకు పాముకాటు
దంతాలపల్లి : ఓ రైతు పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని వేములపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుండగాని వెంకన్న ఉదయం తన పొలంలో నీళ్లు పెట్టి గట్లు వేస్తున్నాడు. ఈ క్రమంలో తన కాళ్లు, చేతులకు అంటుకున్న బురదను శుభ్రం చేసుకునే సమయంలో పాము కాటు వేసింది. గమనించిన రైతు.. కుటుంబ సభ్యులతో కలిసి మండలకేంద్రంలోని ఆస్పత్రికి వచ్చాడు. వైద్యురాలు కవిత, ఏఎన్‌ఎం కవిత చికిత్స అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాము, తేలు కాటు విషానికి ఆస్పత్రిలో విరుగుడు (ఇంజక్షన్) ఉందన్నారు. తేలు, పాముకాటుకు గురైన మండల ప్రజలు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే ఆస్పత్రికి రావాలన్నారు.