
అనుమతుల కోసం అడ్డదారులు
● డబ్బులు ముట్టజెప్పిన
‘వరంగల్ ఫాదర్ కొలంబో’
● ట్రస్టీ కొమ్మారెడ్డి జోసెఫ్‌పై
సీబీఐ కేసు నమోదు
కాజీపేట రూరల్: నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) స్కామ్‌లో వరంగల్ హంటర్‌రోడ్డు బ్రిడ్జి సమీపంలోని ఫాదర్ కొలంబో మెడికేర్ ఆస్పత్రి (ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పాత్ర సంచలనం రేపుతోంది. అధికారిక అనుమతుల కోసం డబ్బులు ముట్టజెప్పినందుకు వరంగల్‌కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కళాశాల ట్రస్టీ కొమ్మారెడ్డి జోసెఫ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కళాశాల తనిఖీల్లో ఎన్‌ఎంసీ అధికారులు అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు మధ్యవర్తులకు జోసెఫ్ లంచాలు ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాంలో తేలింది. దేశవ్యాప్తంగా 36 మందిపై సీబీఐ కేసులు నమోదు చేయగా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదుగురిలో వరంగల్‌కు చెందిన జోసెఫ్‌పై కేసు నమోదైంది. మెడికల్ కళాశాల క్లియరెన్స్, అధికార అనుమతుల కోసం మధ్యవర్తులకు రూ.20 లక్షలు, రూ.46 లక్షల చొప్పున రెండుసార్లు జోసెఫ్ ముట్టజెప్పినట్లు తేలింది. ఈ విషయమై వివరణ కోసం ట్రస్టీ కొమ్మారెడ్డి జోసెఫ్‌కు శుక్రవారం రాత్రి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
రైల్వే ఇన్‌స్టిట్యూట్ తనిఖీ
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్‌ను శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ (ఏపీఓ, ఇంజనీరింగ్ విభాగం) జితేంద్రకుమార్ బృందం తనిఖీ చేసింది. రైల్వే ఇన్‌స్టిట్యూట్, కమ్యూనిటిహాల్, స్టేడియాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఇన్‌స్టిట్యూట్ నిర్వహణ, రికార్డులు, మెంబర్స్‌షిప్ వివరాలు, సౌకర్యాలు, సదుపాయాలను తనిఖీ చేశారు. ఇన్‌స్టిట్యూట్ బాయ్స్ వివరాలు, వేతనాలు అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీహాల్ నిర్వహణ బాగుందని అభినందించారని ఇన్‌స్టిట్యూట్ ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్‌రావు తెలిపారు. తనిఖీలో రైల్వే వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్లు విష్ణువర్ధన్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, ఓఎస్ సత్యనారాయణ ఉన్నారు.

అనుమతుల కోసం అడ్డదారులు