
నేషనల్ మీట్‌లోనూ సత్తా చాటాలి
వరంగల్ క్రైం: జోనల్ డ్యూటీ మీట్‌లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు.. జాతీయ స్థాయిలో నూ సత్తా చాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ శుక్రవారం ముగిసింది. జోనల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు, మహబుబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పలు విభాగాల్లో పోటీపడ్డారు. ప్రతిభ కనబరిచిన వారికి సీపీ పతకాలు అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగానికి 15 గోల్డ్ మెడల్స్‌తో సహా మొత్తం 31 పతకాలు వచ్చా యి. అలాగే, భద్రాద్రి కొత్తగూడెంకు 19, మహబూబాబాద్ జిల్లాకు 17, ఖమ్మం జిల్లా అధికారులు 5 పతకాలు సాధించినట్లు నిర్వాహకులు వివరించారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ సాధన చేస్తే వృత్తి నైపుణ్యంతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చవచ్చని అన్నారు. పోటీల విజయవంతానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందికి సీపీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, ప్రభాకర్‌రావు, బోనాల కిషన్, వ రంగల్ ఏఎస్పీ శుభం, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
సీపీ సన్‌ప్రీత్ సింగ్