
అంగవైకల్యమైనా నయా పైసా ఇవ్వలే..
దేవరుప్పుల: పన్నెండేళ్ల క్రితం విద్యుత్ శాఖలో అన్‌మ్యాన్ కార్మికుడిగా చేరా. 2103లో రూ.1,800 జీతంతో ప్రారంభమైన నా సర్వీస్ నేటికి రూ.13 వేల వేతనం తప్ప ఏ ఇతర సౌకర్యాలు లేవు. 2021లో దేవరుప్పల మండలం కోలుకొండలో ఎల్‌సీ తీసుకుని పని చేస్తున్న క్రమంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ (ఉద్యోగ విరమణ పొందిన వృద్ఢుడు తిరిగి విధుల్లో చేరిన వ్యక్తి) రెండు ఫీడర్ బదులు ఒక్కటే ఆఫ్ చేశారు. ఎల్‌సీ క్లియర్ అని చెప్పగానే స్తంభం ఎక్కి మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలి కింద పడ్డా. దీంతో నా చెయ్యి కాలింది. ఛాతీ పై తీవ్రగాయాలై ప్రాణపాయ స్థితిలోకి వెళ్లా. కుటుంబ సభ్యులు అప్పు చేసి సుమారు రూ.18 లక్షలు ఖర్చు చేస్తేనే బతికా. శాఖ పరంగా తిరిగి విధుల్లో తీసుకున్నారే తప్ప ప్రత్యేకించి నయా పైసా ఇవ్వలేదు. ఇతర పనులు చేయని మాకు పర్మనెంట్ చేసి తగిన పనులు అప్పగించి ఆదుకోవాలి.
– గొడిశాల వెంకటేశ్, అన్‌మ్యాన్ కార్మికుడు, దేవరుప్పుల