
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ శరత్‌చంద్ర పవార్
మహబూబాబాద్ రూరల్: పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. ప్రజావాణిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 11నుంచి మధ్యాహ్నం 2వరకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎస్పీ తెలిపారు.
ఎస్పీని కలిసిన
అడిషనల్ ఎస్పీ..
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రేల జనార్దన్ రెడ్డి పదోన్నతిపొంది అడిషనల్ ఎస్పీ(ఏఆర్)గా జగిత్యాలకు వెళ్తున్న సందర్భంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాలో ఏఆర్ డీఎస్పీగా జనార్దన్ రెడ్డి అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, అర్‌ఐలు పూర్ణచందర్, నరసయ్య, లాల్ బాబు పాల్గొన్నారు.
ఎస్పీ శరత్‌చంద్ర పవార్