చెరువులో మట్టి తవ్వకాల నిలిపివేత
బేతంచెర్ల: మండలపరిధిలోని ఎం.పేండేకల్లు గ్రామ పంచాయతీలోని వెంకటగిరి– మర్రికుంట గ్రామాల మధ్యన ఉన్న చెర్వులో జరుపుతున్న మట్టి తవ్వకాలు ఎట్టకేలకు నిలిపివేశారు. చెరువులోని నల మట్టిని జేసీబీ ద్వారా తవ్వి టిప్పర్లతో కల్లూ మండలం ఉలింద కొండ ఇటుకల బట్టీలకు అక్రమంగా తరలిస్తుండగా సోమవారం రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తర్వాత మట్టి తవ్వకం విషయం నంద్యాలకు వెళ్లి జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె చెరువులో మట్టి తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో మండల అధికారులు బుధవారం చెరువు వద్దకెళ్లి తవ్వకాలు ఆపివేశారు.


