పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
కర్నూలు: పెళ్లి కాలేదన్న మనస్తాపంతో కర్నూలు ఎస్.నాగప్ప వీధిలో నివాసముంటున్న వరప్రసాదరావు (36) ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే కాలనీలో నివాసముంటున్న వితంతువుతో ఐదేళ్లుగా సహజీవనంలో ఉన్నాడు. గత నెల 30వ తేదీన డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవ జరిగి మనస్తాపానికి గురయ్యాడు. తన చావుకు కారణం ఆమెనే అని సూసైడ్ లేఖ రాసి జేబులో పెట్టుకుని మంగళవారం రాత్రి గదిలో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండో పట్టణ ఎస్‌ఐ తిమ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కోసిగి: తల్లిదండ్రులతో కలసి వలస వెళ్లిన విద్యార్థి హాల్వి నరేంద్ర (13) పాము కాటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. వందగల్లు గ్రామానికి చెందిన హాల్వి మహానంది, నరసమ్మ దంపతులు పనుల కోసం రెండు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా బిణిగంపాల గ్రామానికి వలస వెళ్లారు. గ్రామంలో 8వ తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు నరేంద్రతో పాటు రెండో కుమారుడు జనార్దన్ (4వ తరగతి), మూడో కుమారుడు మోహన్ (2వ తరగతి) కూడా తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ పత్తి పనులు చేసుకుని కాలం గడుపుతున్నారు. మంగళవారం పత్తి పనులు ముగించుకుని రాత్రి పొలం సమీపంలోనే వేసుకున్న గుడిసెలో నిద్రిస్తుండగా పెద్ద కుమారుడు నరేంద్రను పాముకాటు వేసింది. స్థానిక వైద్యులకు చూపించినా కోలుకోలేక మృతి చెందాడు. మృతి చెందిన కుమారుడిని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య


