‘స్థానిక’ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంఘాల నేతలు
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై స్పష్టత ఇవ్వాలని బీసీ సంఘాల నేతలు కోరారు. బుధవారం స్థానిక బిర్లా కాంపౌండ్‌లోని సాయి వసంత్ కాంప్లెక్స్‌లో బీసీ సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పగడాల ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీ య కార్యదర్శి బత్తుల లక్ష్మికాంతయ్య, యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అయ్యన్నయాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు దేవపూజ ధనుంజయ ఆచారి, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు సింధు నాగేశ్వరరావు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనాభాలో సగభాగంగా ఉన్న బీసీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీల జనాభా మేరకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే శా సీ్త్రయ పద్ధతిలో కులగణనను చేపట్టి బీసీల నిజ మై న జనాభా సంఖ్యను ప్రకటించాలన్నారు. వివిధ బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన బడ్జెట్ కేటాయించాలన్నారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, బీసీ విద్యార్థులకు వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు చంద్రి క, నాగేశ్వరినాయుడు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ టీజీ శ్రీనివాసులు, శ్రీరామ్‌యాదవ్, వెంకటేశ్వర్లు, రవి,రాము యాదవ్, భరత్‌భూషణ్, లక్ష్మన్న, ప్రి యాంకయాదవ్, రాము, సవారన్న హాజరయ్యారు.


