వైఎస్సార్‌సీపీ పీఆర్ విభాగం కర్నూలు ఇన్‌చార్జ్‌గా సీ
అనంతపురం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ పంచాయతీ రాజ్ విభాగం కర్నూలు ఇన్‌చార్జ్‌గా పీఆర్ విభాగం గుత్తికి చెందిన సీవీ రంగారెడ్డి (పీఆర్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్లు పీఆర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి బుధవారం వెల్లడించారు.
గ్రామీణ ప్రాంత
యువకులకు ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు, నంద్యాల జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఒకే సమయంలో మూడు కోర్సులకు సంబంధించి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఈ సంస్ధ డైరెక్టర్ కే.పుష్పక్ తెలిపారు. హౌస్ వైరింగ్, సెల్‌ఫోన్ రిపేరి, బైక్‌మెకానిక్ సర్వీసింగ్‌లలో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి 30 రోజుల ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మరిన్ని వివరాలకు 08518– 273710, 9000710508, 63044 91236 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చన్నారు.
రేపు ధ్రువ పత్రాల పరిశీలన
కర్నూలు కల్చరల్: ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటి
షిప్ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఐటీఐ పాస్ అయిన విద్యార్థుల ఒరిజినల్ ధ్రుపత్రాల పరిశీలన చేయనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ బాలికల కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.నాగరాజు తెలిపారు. ఈనెల 5వ తేదీ ఉదయం 9 గంటలకు కర్నూలు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఆధార్, కులం, ఆదాయ సర్టిఫికెట్లు తీసుకొని రావాలని తెలిపారు.
డిటోనేటర్ల దొంగల అరెస్ట్
● 24 గంటల్లోనే మిస్టరీని
ఛేదించిన పోలీసులు
పెద్దవడుగూరు: మండలంలోని కోనాపురం సమీపంలో ఉన్న కార్తికేయ ఎంటర్‌ప్రైజెర్స్‌లో సోమవారం రాత్రి డిటోనేటర్లను అపహరించుకెళ్లిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన చోటు చేసుకున్న 24 గంటల్లోపే కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. పెద్దవడుగూరు పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి వెల్లడించారు. పట్టుబడిన వారిలో యాడికి మండల చందన గ్రామానికి చెందిన రవికుమార్, పామిడిలోని నాగిరెడ్డి కాలనీ నివాసి చిట్టావుల రాము, కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన ఉప్పర వీరేష్ ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రవికుమార్ గతంలో కార్తికేయ ఎంటర్‌ప్రైజెర్స్‌లో ఎక్స్‌ప్లోజివ్ మ్యాగజైన్ విభాగం డ్రైవర్‌గా పనిచేశాడు. అయితే జీతం ఇవ్వకపోవడంతో పని మానేసిన అతను ఎలాగైనా స్టాక్ పాయింట్‌లో నిల్వ ఉన్న ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్‌ను తీసుకెళ్లి విక్రయించి తన డబ్బు తీసుకోవాలని భావించాడు. ఇందుకు తన స్నేహితులు చిట్టావుల రాము, ఉప్పర వీరేష్‌తో కలసి పథకం రచించాడు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి కారులో కార్తికేయ ఎంటర్‌ప్రైజెర్స్ గోదాము వద్దకు చేరుకుని గోడకు కన్నం వేసి లోపలకు ప్రవేశించి రూ.2 లక్షల విలువైన డిటోనేటర్లు అపహరించుకెళ్లారు. మంగళవారం ఉదయం విషయాన్ని గుర్తించిన మేనేజర్ శ్యాంకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో చందన గ్రామ సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.


