
జగ్జీవన్ వర్ధంతిని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు (టౌన్): స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని కూటమి ప్రభుత్వం విస్మరించడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ‘కనీసం జిల్లా అధికారులకు దండలు వేసేంత సమయం కూడా లేదా’ అని ప్రశ్నించారు. అధికారులకు, ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఆదివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కర్నూలులోని ఆర్‌ఎస్ రోడ్డులో ఉన్న బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్వీ మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయుల వర్ధంతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. జయంతులను ఏ విధంగా నిర్వహిస్తారో.. వర్థంతులను కూడా అలాగే జరిపి, మహనీయుల గొప్ప త్యాగాలను ప్రజలకు తెలిపే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాబు జగ్జీవన్ రాం మన దేశానికి ఉపప్రధానిగా, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా, వివిధ శాఖల్లో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. 1971 ఇండో–పాక్ యుద్ధ సమయంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారన్నారు. భారత దేశంలో హరిత విప్లవం రావడానికి ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు కమతం పరశురాం, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి రైల్వే ప్రసాద్, జిల్లా కార్యదర్శి సర్వేశ్వర రెడ్డి, ఆర్‌టీఐ నగర అధ్యక్షులు గద్ద రాజశేఖర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రభుదాస్, ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షులు సత్యరాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నవీన్, లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి రాజేష్, యువజన విభాగం కార్యదర్శులు యోగి, యోగేంద్ర కుమార్, చందు, ఏసు, వన్నేష్, రాజు, నాగరాజు, శ్రీకాంత్, అశోక్, తిమ్మన్న, శివ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి