
పెండింగ్‌లో ఉన్నవి ఇవీ..
● ఆసుపత్రిలో ఇన్‌పేషంట్ డిపార్ట్‌మెంట్ భవనం నిర్మాణం ప్రారంభమై వేగంగా పనులు జరుగుతుండగా రూ.60.5కోట్లు ఖర్చు అయితే అప్పట్లో రూ.42కోట్లు చెల్లించారు. ఇంకా రూ.18.5కోట్లు పెండింగ్‌లో ఉంది.
● లెక్చరర్ గ్యాలరీకి, ఎగ్జామినేషన్ హాలుకు పనులు జరుగుతుండగానే బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం ఎగ్జామినేషన్ హాలు దాదాపుగా పనులు పూర్తయి కేవలం ప్యాచ్ వర్క్ పెండింగ్‌లో ఉంది. దీనిని పూర్తి చేయలేక ఏడాది కాలంగా దీనిని మూసి ఉంచారు.
● ఆగిపోయిన డ్రగ్ కంట్రోల్ భవనాన్ని పూర్తి చేయించేందుకు నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు దానికి కేవలం రూ.46లక్షలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 98 శాతం పనులు పూర్తయిన ఈ భవనం మిగిలిన పనులు పూర్తిగాకపోవడం వల్ల ప్రారంభం వాయిదా పడుతూ వస్తోంది.
● ప్రస్తుతం ఐపీడీకి రూ.18.5కోట్లు, లెక్చరర్ గ్యాలరీకి 2.95కోట్లు, ఎగ్జామినేషన్ హాలుకు రూ.79లక్షలు, డ్రగ్ కంట్రోల్ భవనంకు రూ.46లక్షలు కలిపి మొత్తం రూ.22 కోట్ల 70లక్షలు మాత్రమే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.