
‘నిషా’ చరులు!
మందుబాబులపై నెలవారీగా నమోదైన కేసులు
ఫిబ్రవరి 1,976
మార్చి 1,041
ఏప్రిల్ 1,926
మే 1,435
జూన్ 1,762
మొత్తం 8,140
కర్నూలు: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారు ఎక్కువయ్యారు. జిల్లా వ్యాప్తంగా గత ఐదు నెలల కాలంలో మద్యంబాబులపై 8,140 కేసులు నమోదయ్యాయి. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, నడకదారులు, పార్కులు, వ్యాపార సముదాయాలు, శివారు ప్రాంతాలు అడ్డాలుగా చేసుకుని మద్యం తాగుతున్న వారిపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా వేసి కేసులు నమోదు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజలకు అసౌకర్యం కల్గిస్తే చర్యలు ఉంటాయని పోలీసులు తనిఖీల సందర్భంగా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ నడకదారులు, పార్కులు, శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని మద్యం తాగడమే కాక ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తున్నారు. పోలీసుల నిఘా తీవ్రం చేసి పబ్లిక్ న్యూసెన్స్ కింద చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కల్గిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఓపెన్ డ్రింకింగ్‌పై తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు.
ఐదు నెలల కాలంలో
8,140 కేసుల నమోదు