
అక్రమ మద్యం, నాటుసారా పట్టివేత
కర్నూలు: ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి 48 మద్యం బాటిళ్లు, 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్, ఈఎస్‌టీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్ తదితరులు తమ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి శుక్రవారం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కాల్వ గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వైకే తండాకు చెందిన లౌడ్య నరేష్ నాయక్ ద్విచక్ర వాహనంపై 30 లీటర్ల నాటుసారాను తీసుకెళ్తూ ఎకై ్సజ్ అధికారులను చూసి బైక్, సారాను వదిలేసి పారిపోయాడు. సారాతో పాటు బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కర్నూలు మండలం మునగాలపాడు గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో మధుక్రిష్ణను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 48 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జైలుకు పంపారు. దాడుల్లో కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్స్ ఎస్‌ఐ నవీన్ బాబు, సిబ్బంది మురహరి రాజు, చంద్రపాల్, ఈరన్న, మధు పాల్గొన్నారు
జనవిజ్ఞాన వేదిక వర్క్ షాప్‌ను విజయవంతం చేయండి
డోన్ టౌన్: ఈనెల 11న స్థానిక శ్రీసుధ సీబీఎస్‌సీ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో నిర్వహించనున్న జనవిజ్ఞాన వేదిక నాలుగు జిల్లాల ప్రాంతీయ వర్క్ షాప్‌ను విజయవంతం చేయాలని వేదిక రాష్ట్ర కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యంశెట్టి కోరారు. కొత్తపేట జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన వర్క్ షాపు నిర్వాహణపై కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల జన విజ్ఞాన వేదిక నాయకులు, కార్యకర్తలతోపాటు మాజీ శాసన మండలి సభ్యులు, ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు పాల్గొననున్నట్లు తెలిపారు. సమావేశంలో డివిజన్ అధ్యక్షులు సర్వజ్ఞమూర్తి, నాయకులు ఎన్‌ఎస్ బాబు, జిల్లా నాయకులు లతీఫ్, రామ్మూర్తి పాల్గొన్నారు. .