
అగ్ని వీర్‌లో మెరిసి.. ఆదర్శమై నిలిచి!
● సత్తా చాటిన ఆస్పరి యువకులు ● వీరంతా మోడల్ స్కూల్ పూర్వ విద్యార్థులే .. ● హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు
ఆస్పరి: వారి కుటుంబాలకు వ్యవసాయమే ఆధారం. తల్లిదండ్రులు పడే కష్టాలు కళ్లారా చూశారు. అయినా తమ పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో అప్పోసప్పో చేసి చదివించారు. వారి నమ్మకాన్ని ఆ పిల్లలు వమ్ము చేయలేదు. అగ్రివీర్‌లో ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. గత మార్చి 28న గుంటూరులో కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిపథ్ సెలక్షన్స్‌లో ఆస్పరి మండలానికి చెందిన ఐదుగురు యువకులు సత్తా చాటి జీడీ(జనరల్ డ్యూటీ) ఉద్యోగాలు సాధించారు. వీరంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు కావడంతోపాటు టెన్త్, ఇంటర్ మండలంలోని పుటకలమర్రి సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాలలోనే పూర్తి చేశారు. ఒకేసారి ఐదుగురు తమ పాఠశాల పూర్వ విద్యార్థులు ఇండియన్ ఆర్మీకి ఎంపికై తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవడంతో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉద్యోగాలు సాధించిన యువకుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..