
దర్గాలో ఫాతెహాలు చేస్తున్న దృశ్యం
● ఢిల్లీ ఖాజా నిజాముద్దీన్ దర్గా పీఠాధిపతి సయ్యద్ ఖాజా మొహమ్మద్
కౌతాళం: మత సామరస్యానికి దర్గాలు ప్రతీకలుగా నిలుస్తున్నాయని ఢిల్లీలోని ఖాజా నిజాముద్దీన్ దర్గా పీఠాధిపతి సయ్యద్ ఖాజా మొహమ్మద్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఖాదర్‌లింగస్వామి దర్గాను సందర్శించి ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. ఈయనకు దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా, పీఠాధిపతి ఖాదర్‌బాషా, శిష్య బృందం స్వాగతం పలికారు. దర్గాలో ఫాతెహాల అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాదర్‌లింగస్వామి దర్గాను కులమతాలకు అతీతంగా ప్రజలు దర్శించుకోవడం శుభపరిణామం అన్నారు. ఇటీవల నిర్మించిన మజ్జీద్‌లో దర్గా ధర్మకర్త మున్నపాషాకు ఖురాన్‌ను అందజేశారు. కార్యక్రమంలో కర్ణాటకలోని సర్మస్‌వలి దర్గా నిర్వాహకుడు దూద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.