
నిందితుడిని అరెస్టు చూపుతున్న పోలీసులు
డోన్ టౌన్: చిన్నమల్కాపురం గ్రామంలో మార్చి 26వ తేదీన జరిగిన పూసలపాటి నాగేశ్వరమ్మ అలియాస్ మహేశ్వరి హత్య కేసు మిస్టరీ వీడింది. వరుసకు మరిది అయిన నాగమద్దిలేటి అలియాస్ లోడ్డోడు.. కుటుంబ కలహాలను మనస్సులో పెట్టుకుని వరుసకు వదిన అయిన మహేశ్వరిని హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. పొలం నుంచి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలోని నాయని వంక వద్ద మహేశ్వరిని అడ్డగించి పెద్ద బండ రాయితో తలపై మోది హత్య చేసినట్లు తెలిపారు. నాగమద్దిలేటి ఈ విషయాన్ని గ్రామ తలారి రామచంద్రుడుకు తెలిపారని, గ్రామ సచివాలయం వద్ద నిందితుడిని ప్యాపిలి సీఐ శ్రీరాములు, రూరల్ ఎస్‌ఐ సురేష్ అరెస్టు చేసినట్లు తెలిపారు.