
ప్రశ్న: ఈ ఏడాది ఫలితాల శాతం
పెరుగుతుందా?
జవాబు: పదవ తరగతిలో 100 శాతం ఫలితాలు సాఽధించాలనే ఉద్దేశంతో కలెక్టర్ సూచనల మేరకు చాలా ముందస్తు ప్రణాళికను తయారు చేసుకొని పని చేశాం. రాత్రి వేళల్లో నైట్ విజిట్ చేపట్టాం. పిల్లల ఇళ్లకు వెళ్లి వారి చదువులపై పేరెంట్స్‌తో మాట్లాడడంతో వారు సైతం పిల్లల చదువును ప్రోత్సహించారు. కచ్చితంగా అంచనా మేరకు మంచి ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది.
కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ డా.వి రంగారెడ్డి అన్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి కేంద్రాన్ని తనిఖీ చేసిన తరువాతే ఎంపిక చేశామని, గతంలో జరిగిన సంఘటన దృష్ట్యా ఈ ఏడాది పరీక్ష కేంద్రాల చుట్టు పక్కల ప్రాంతాలను నో సెల్‌ఫోన్ జోన్లుగా ప్రకటించినట్లు తెలిపారు. అయితే పది పరీక్షలపై శనివారం డీఈఓతో ‘సాక్షి’ ముఖాముఖీ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రశ్న: పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లు
ఎలా ఉన్నాయి?
జవాబు: పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి విద్యార్థి బెంచీపైనే కూర్చొని పరీక్షలు రాయనున్నారు. ప్రతి సెంటర్‌లో ఫ్యాన్లు, గదిలో కావాల్సిన లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం.
ప్రశ్న: ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు?
ఎంత మంది హాజరుకానున్నారు?
జవాబు: జిల్లాలో 149 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం, ఇందులో ఏ క్యాటగిరి సెంటర్లు 79, బీ క్యాటగిరి సెంటర్లు 54, సీ కేటగిరి సెంటర్లు 16 ఉన్నాయి. మొత్తం 32,760 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.
ప్రశ్న: సమస్యాత్మకమైన కేంద్రాల భద్రత ఏమేరకు ఉంటుంది?
జవాబు: జిల్లాలో 10 సమస్యాత్మకమైన కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాం. అన్ని కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు ఉంటుంది.
ప్రశ్న: పరీక్షకు ఒక్క నిమిష్యం ఆలస్యమైనా
అనుమతిస్తారా?
జవాబు: పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటాయి. ఒక్క నిమిష్యం ఆలస్యం అయినా ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతిస్తారు. అయితే ఆయా కేంద్రాల సీఎస్‌లే నిర్ణయాలు తీసుకుంటారు.
ప్రశ్న: విద్యార్థులకు రవాణా సదుపాయాలు
ఎలా ఉన్నాయి?
జవాబు: పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. హాల్ టికెట్లు చూపితే సరిపోతుంది. 44 రూట్లకు పరీక్ష సమయానికి విద్యార్థులు చేరేలా ఏర్పాట్లు చేశాం.
ప్రశ్న: నో సెల్‌ఫోన్ జోన్‌గా ప్రకటించారు..
ఎందుకు?
జవాబు: గతంలో పరీక్షల సమయంలో జరిగిన సంఘటన దృష్ట్యా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను నో సెల్‌ఫోన్ జోన్లుగా ప్రకటించాం. పరీక్ష విధుల నిర్వహించే సిబ్బంది ఇంటి దగ్గరే ముఖ హాజరును వేసుకొని సెల్ ఇంటి వద్దే ఉంచి కేంద్రానికి వెళ్లాలి. ఒక వేళ కేంద్రాల్లో ఎక్కడైనా సెల్‌ఫోన్ కనిపిస్తే మాత్రం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
ప్రశ్న: ఎంత మంది సిబ్బందిని ఎంపిక చేశారు?
జవాబు: 149 కేంద్రాలకు ముఖ్య పర్యవేక్షకులు, డిపార్టమెంటల్ ఆఫీసర్స్‌ను, 16 సీ కేటగిరి కేంద్రాలకు 16 మంది కస్టోడియన్స్‌ను ఎంపిక చేశాం. 1645 మంది ఇన్విజిలెటర్లను వారిపై ఎలాంటి ఆరోపణలు కానీ, కేసులు కానీ నమోదు కానీ వారిని ఎంపిక చేశాం. 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్, సమస్యాత్మకమైన కేంద్రాల దగ్గర 10 మంది సిట్టింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశాం.
ప్రశ్న: పరీక్షల నిర్వహణ కోసం
స్కూల్ గ్రాంట్ నుంచి ఖర్చు చేస్తున్నారా?
జవాబు: పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాకు రూ.60 లక్షలు మంజూరు అయ్యాయి. కానీ కొందరు నిధులు కేటాయించలేదని, స్కూల్ గ్రాంట్ నుంచే వాడుకోవాలని సూచించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది సరైంది కాదు. ఎలాంటి నిధులు కొరత లేదు. ఇప్పటికే నిధులు పరీక్షల విభాగం ఖాతాలో జమ అయ్యాయి.
ప్రశ్న: యాక్ట్ 25/1997ను అమలు చేస్తున్నారా?
జవాబు: పరీక్షలలో అక్రమాలను నియంత్రించేందుకు 1997 సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టం 25ను కఠినంగా అమలు చేయనున్నాం. దీని ప్రకారం పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే ఇన్విజిలేటర్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ఆ తరువాత కేసు విచారణలో రుజువు అయితే 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.5 వేల నుంచి రూ.లక్షకుపైగా జరిమానా వేస్తారు. దీంతో పాటు ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉంది.
జిల్లాలో 149 పరీక్షా కేంద్రాలు
ఏర్పాటు
నో సెల్‌ఫోన్ జోన్‌గా
పరీక్షా కేంద్రాలు
‘సాక్షి’ ముఖాముఖిలో
డీఈఓ డాక్టర్ వి.రంగారెడ్డి వెల్లడి
