డ్వామా సిబ్బందికి స్థానచలనం | Sakshi
Sakshi News home page

డ్వామా సిబ్బందికి స్థానచలనం

Published Sun, Apr 2 2023 1:14 AM

-

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా)లో ఎక్సెస్‌ ఉన్న సిబ్బందిని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కేటగిరిల్లో శాంక్షన్‌ పోస్టుల కంటే ఎక్కువగా ఉండటంతో గ్రామీణాభివృద్ధి శాఖ రేషనలైజేషన్‌ చేపట్టింది. ఈ ప్రక్రియను ముగిస్తూ ఎక్సెస్‌గా ఉన్న సిబ్బందిని వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నుంచి ఎక్కువగా ఉన్న ఏపీవోల్లో బి.మాలిక్‌బాషా(పల్నాడు), పి. కుమార్‌సాయినాథ్‌(ప్రకాశం), వి.జయరాముడు (ఎన్‌టీఆర్‌ జిల్లా). ఎన్‌.జుబీబ్‌(తిరుపతి), కే.వెంకటేశ్వర్లు(తిరుపతి)లను బదిలీ చేశారు. సీవోఅండ్‌ ఏఏ(కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ అకౌంట్స్‌ అసిస్టెంటు) కేటగిరిలో 53 మందిని బదిలీ చేశారు. ఇందులో 14 మంది నంద్యాల జిల్లాకు వెళ్తుండగా మిగిలిన వారు ఇతర జిల్లాలకు వెలుతున్నారు. ఎక్కువగా ఉన్న సాంకేతిక సహాయకులు(టీఏ) 81 మంది బదిలీ చేశారు. అయితే నంద్యాల జిల్లా నుంచి 12 మంది టీఏలు కర్నూలు జిల్లాకు కేటాయించారు. కర్నూలు జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీ కార్యాలయంలో 11 మంది మాత్రమే సీవో అండ్‌ ఏవో అండ్‌ ఏఏలను వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు వీరు 26 మంది పని చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లతో యశోదరావు, పి.భార్గవి, పెంచలయ్య, భాగ్యరాజు, ఏపీవోలు పి.మధుబాబు, శంకర్‌రావు పీడీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. వీరిని మండలాలకు పంపే విధంగా ఆదేశాలు వచ్చాయి. గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన అదేశాలు తక్షణమే అమలులోకి వచ్చినట్లుగా అఽధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement