
లబ్ధిదారులతో మాట్లాడుతున్న్ల కలెక్టర్ కోటేశ్వరరావు
పత్తికొండటౌన్: ఇళ్ల నిర్మాణం పూర్తయితే జగనన్న కాలనీలు కొత్త గ్రామాలుగా మారతాయని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం పత్తికొండ పట్టణ శివారులోని జగనన్న కాలనీని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణ పురోగతిపై హౌసింగ్ డీఈ గురుప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే రోడ్లు వేస్తామన్నారు. అనంతరం చక్రాళ్లరోడ్డులో ఉన్న కస్తూర్బా విద్యాలయం, అంబేడ్కర్ బాలికల గురుకులాలను సందర్శించిన పదో తరగతి విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. కస్తూర్బా విద్యాలయంలో నాడు–నేడు పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామసచివాలయం–6ను తనిఖీ చేశారు.