
ఆరోగ్యం జాగ్రత్త..
రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు. కనీసం నీరు కూడా తీసుకోరు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
A ఇఫ్తార్ సమయంలో ఆహార పదార్థాలు, పానీయాలపై నియంత్రణ ఉండాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు, పానీయాలే తీసుకోవాలి.
A ఇన్సూలిన్ ఉత్పత్తిని సరిదిద్దగలిగే షుగర్ మందు మెట్ఫోర్మిన్ వాడుతున్నవారు ఇఫ్తార్ సమయంలో మాత్రల మోతాదులను వైద్యుడి సలహాతో తీసుకోవాలి.
A పాంక్రియాస్ గ్రంధి నుంచి ఇన్సూలిన్ విడుదలకు దోహదపడే గ్లిబెస్కమైడ్ మందులు వాడుతున్న వారు వైద్యుడి సలహాతో స్వల్ప వ్యవధికి పని చేసే గ్లిపిజైడ్, రేపగ్టినైడ్ వాడవచ్చు.
A టైప్– 1 డయాబెటీస్ నియంత్రణలో లేనివారు, టైప్–2 డయాబెటీస్ ఉన్నవారు ఉపవాసం ఉండవకపోవడం మంచిది.
A ఇఫ్తార్‌లో తీసుకునే తియ్యటి ఆహార పదార్థాలను తక్కువ మొత్తానికే పరిమితం చేయాలి. అన్నం, చపాతీలు, నాన్ వంటి పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
A ఇఫ్తార్, సహెరీలో పప్పు, పెరుగు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
A సహెరీ భోజనం మరీ అర్ధరాత్రి కాకుండా సూర్యోదయానికి ముందు తీసుకోవాలి. ఇది ఉపవాస సమయంలో సమాంతర శక్తి పొందటానికి, రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
కర్నూలు (రాజ్‌విహార్): రంజాన్.. ముస్లింలకు పవిత్ర మాసం. అంతేకాదు పుణ్యాలు సంపాదించుకునే మాసం కూడా ఇదే. ఇస్లామిక్ క్యాలెండర్‌లో షాబాన్ ముగిశాక వచ్చే ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది. అత్యంత నియమనిష్టలతో ఉపవాసాలు, దివ్య ఖురాన్ పఠనం, ఐదు పూటల నమాజ్, తరావీ నమాజ్ చదువుతారు. దీంతో పాటు ప్రతి ముస్లిం తమ సంపాదనలో కొంత భాగం పేదల కోసం వెచ్చిస్తారు. ఎందుకంటే చేసే ఏ సాయానికి అయిన 70 రేట్లు అధిక ఫలం లభిస్తుందని మతపెద్దలు చెబుతారు. దీంతో నెల పొడవునా ముస్లింలు విరివిగా దానధర్మాలు చేస్తుంటారు. మహమ్మద్ ప్రవక్త సొల్లెల్లాహు అలైహి వసొల్లం సూచించిన మార్గాలను అనుసరిస్తే పాప విముక్తులై దేవుడి అనుగ్రహం పొందుతారని మౌల్వీలు చెబుతున్నారు.
Aఫరజ్: అల్లాహ్ సూచించిన, కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను ఫరజ్ అంటారు. వీటిని ముస్లింలు తప్పనిసరిగా ఆచరించాలి. చిన్న పిల్లలు, మానసిక స్థితి సరిగా లేని వారు, అనారోగ్య సమస్యలున్న వారికి మినహాయింపు ఉంటుంది. నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర వంటివి ఫరజ్ పరిధిలోకి వస్తాయి. రోజుకు ఐదు పూటల నమాజ్, రంజాన్ జకాత్ పేరుతో దాన ధర్మాలు, హజ్ యాత్ర చేయాలి. సాధారణ రోజుల్లో ఒక ఫరజ్ నమాజ్ చేస్తే 3,35,54,032 నేకియా (మార్కులు) లభిస్తాయి. రంజాన్‌లో 70 రెట్లు అధికంగా ఉంటుందని మత పెద్దలు చెబుతున్నారు.
Aసున్నత్: మహమ్మద్ ప్రవక్త (సొ.అ.వ.) దిన చర్యలో పాటించిన నియమాలను సున్నత్ అంటారు. ఇవి ప్రతి ముస్లిం ఆచరించాలి. గుసుల్ (శుద్ధి స్నానం), వజూ చేయటం, మిస్వాక్ వాడడం, ఫరజ్ నమాజులకు ముందు, తరువాత ప్రవక్త చేసిన నమాజ్‌లను సున్నత్ అంటారు. ఇలా ఎన్నో ఉన్నాయి.
Aనఫిల్: భక్తి కొలది మనం చేసుకునే ప్రార్థనలను నఫిల్‌గా అంటారు. నమాజ్, రోజా, హజ్‌లో నఫీల్‌ను ఆచరించవచ్చు. తగిన ఫరజ్ పుణ్యం లేని పక్షంలో మరణం తరువాత నఫీల్‌ను పరిగణలోకి తీసుకుంటారు. రంజాన్ మాసంలో ఒక నఫిల్ నమాజ్ చేస్తే ఫరజ్ చదివిన పుణ్యం లభిస్తుంది. అందుకే సమయం దొరికిన ప్రతి సారి నఫీల్ నమాజ్ చదువుతూ ఉండాలి.
ఇది పుణ్యాల నెల
మానవులకు అధికంగా పుణ్యం చేకూర్చేందుకు అల్లాహ్ ప్రసాదించిన నెల రంజాన్. ఈ మాసంలో అధ్యాత్మికతలో గడపాలి. ఫరజ్ నమాజులతో పాటు సున్నత్, నఫీల్, ఖురాన్ తరచూ చదవాలి. నిరుపేదలకు ఫిత్రా, జకాత్‌లు దాన ధర్మాలు చేయాలి.
– హఫిజ్ మంజూర్ అహ్మద్,
రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు
రంజాన్‌లో దాన ధర్మాలకు ప్రాధాన్యం
ఒక రూపాయి దానం చేస్తే
రూ.70 చేసిన ఫలితం
నఫిల్ నమాజు చదివితే ఫరజ్ ప్రతిఫలం
