
జిల్లా న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో గెలుపొందిన న్యాయవాదులు
కర్నూలు(లీగల్): కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘానికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా టి.నాగభూషణం నాయుడు, ప్రధాన కార్యదర్శిగా ఎంవీ చక్రపాణి విజయం సాధించారు. మొత్తం 903 ఓట్లు ఉండగా 778 ఓట్లు పోల్ అయ్యాయి. అధ్యక్ష పదవికి పోటీ పడిన టి.నాగభూషణం నాయుడు తన ప్రత్యర్థి బి.చంద్రుడిపై 7 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాగభూషణం నాయుడుకు 391 ఓట్లు రాగా, చంద్రుడుకు 384 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన ఎంవీ చక్రపాణి 39 ఓట్లతో సమీప ప్రత్యర్థి డి.నరసింహులుపై విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న ఎస్.షాబుద్దిన్ 68 ఓట్ల తేడాతో నిత్యజీవన్‌రాజుపై గెలుపొందారు. మహిళా ప్రతినిధి స్థానం కోసం పోటీ పడిన సి.జాస్మిన్ తన ప్రత్యర్థి ఎ.అన్నపూర్ణారెడ్డిపై 93 ఓట్లతో గెలుపొందారు. ప్రత్యర్థులుగా పోటీ చేసినవారు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో కార్యదర్శిగా ఎస్.లక్ష్మణ్, కోశాధికారిగా ఎం.షఫత్, గ్రంథాలయ కార్యదర్శిగా వి.రవికుమార్, క్రీడల కార్యదర్శిగా బి.రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కె.రాజమోహన్‌రెడ్డి ప్రకటించారు. పోలింగ్‌లో ఎన్నికల అధికారికి న్యాయవాదులు పి.వి.వరప్రసాదరావు, ఆంజనేయులు, లోకేశ్వరరెడ్డి, రామకృష్ణ సహాయాధికారులుగా వ్యవహరించారు.
ప్రధాన కార్యదర్శిగా చక్రపాణి విజయం