
థ్యాంక్యూ జగనన్న: ఆసరా వేడుకల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మహిళలు (ఫైల్)
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ హయాంలో చెప్పేది ఒక్కటి.. చేసేది మరొకటిగా ఉండేది. వంద హామీలు ఇస్తే ఒక్కటి కూడా అమలయ్యేది కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. వంద శాతం హామీలు అమలు చేసేందుకు కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజల ప్రేమాభిమానాలను చూరగొంటోంది. రాష్టాన్ని రెండేళ్ల పాటు కోవిడ్–19 అతలాకుతలం చేసింది. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. అయినప్పటికీ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేసిన దాఖలాలు లేవు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ది పనుల నిర్వహణను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టడం విశేషం.
అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం
ఈ నెల 31తో 2022–23 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఏప్రిల్ 1 నుంచి 2023–24వ ఆర్థిక సంవత్సరం మొదలవుతోంది. 2022–23లో వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ఇలా అన్ని పథకాలు క్యాలెండర్ ప్రకారం అమలయ్యాయి. ప్రస్తుతం వైఎస్సార్ ఆసరా సంబరాలు జరుగుతున్నాయి. నవరత్నాల్లో భాగంగా అమలు చేసిన వివిధ కార్యక్రమాలతో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు దాదాపు రూ.1,500 కోట్లకుపైగా ప్రయోజనం చేకూరింది. రైతులు ఒక్క రూపాయి చెల్లించకుండానే సాగు చేసిన పంటలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేశారు. చెప్పిన వాటినే కాకుండా... చెప్పని వాటిని కూడా అమలు చేసిన ఘనత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి దక్కింది. ఒక్కో కుటుంబానికి రెండు, మూడు సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేకూరాయి.
అభివృద్ధి పనులకు ప్రాధాన్యత
జిల్లాలో అభివృద్ది పనులు కూడ జోరుగా సాగుతున్నాయి. ఉపాధి నిధులతో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పాలశీతలీకరణ కేంద్రాలు, నాడు–నేడు కింద కాంపౌండ్ వాల్స్ వంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. జిల్లాలో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రైతుభరోసా కేంద్రాల వారీగా రూ.185 కోట్లతో గోదాముల నిర్మాణాలను నిర్మిస్తున్నారు.
2022–23లో ప్రజలకు అందిన ప్రయోజనాలు
పథకం పేరు లబ్ధిపొందిన వారు ప్రయోజనం పొందిన
మొత్తం (రూ.కోట్లలో)
వైఎస్సార్ రైతుభరోసా 2,79,576 377.31
అమ్మఒడి 2,42,645 363,96
వైఎస్సార్ ఆసరా 2,56,420 141.26
వైఎస్సార్ చేయూత 1,24,045 232.58
వైఎస్సార్ సున్నా వడ్డీ 2,95,200 38.97
వైఎస్సార్ నేతన్న నేస్తం 4,105 9.84
కుటుంబాలు
జగనన్న వసతి దీవెన 46,785 45.64
జగనన్న విద్యాదీవెన 46,023 76.34
ఈబీసీ నేస్తం 20,485 30.72
కాపు నేస్తం 6,849 10.26
గమనిక: ఇంకా పలు పథకాల కింద వివిధ వర్గాల ప్రజలకు
ప్రయోజనం లభించింది.
విద్యార్థుల ఫీజుల భారం తగ్గిస్తూ.. రైతన్నలకు పెట్టుబడి సాయం అందిస్తూ.. చేనేత కార్మికుల కష్టాలు తొలగిస్తూ..చిరు వ్యాపారులకు తోడుగా ఉంటూ.. అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి చేయూత ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది (2022–23 ఆర్థిక సంవత్సరం) కూడా ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే అభివృద్ధి పనులను పరుగులు పెట్టించింది. పల్లెపల్లెలో ప్రభుత్వ భవనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసింది. ప్రగతి పనులను విస్మరించకుండా నిధులు మంజూరు చేసింది. నేటి(శుక్రవారం)తో ఆర్థిక సంవత్సరం యుగియనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం..
నేటితో 2022–23
ఆర్థిక సంవత్సరానికి ముగింపు
క్యాలెండర్ ప్రకారం
అన్ని పథకాలు అమలు
జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు
రూ.1,500 కోట్లకుపైగా ప్రయోజనం