
విజేతల వివరాలను విడుదల చేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారులు
కర్నూలు కల్చరల్: ఇన్‌స్పైర్ మానక్ జిల్లాస్థాయి ప్రదర్శనలో 24 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీఈవో వి.రంగారెడ్డి వెల్లడించారు. విజేతల వివరాలను డీఈవో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన ఎన్‌ఐఎఫ్ వారు ఆన్‌లైన్‌లో ప్రదర్శనలు ఏర్పాటు చేశారన్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా నుంచి 24 మంది విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారన్నారు. వీరికి ఈనెల 23, 24 తేదీల్లో కాకినాడలో రాష్ట్ర స్థాయి ప్రదర్శన ఉంటుందన్నారు. సాధు తరుణ్, చాకలి ప్రాణేష్, చాకలి సోమశేఖర్, బన్నూరు రఘునాథ్‌రెడ్డి, కందుకూరి నరేష్, ఆర్.శివ, ఉన్నమ్ సుష్మసాయి, సోంపల్లి జయశ్రీ, పి.శ్రీనివాసులు, తెలుగు మనీశ్వర్, బట్టుకిరణ్, మంగలి హేమలత, ఎమ్.యూనుస్ భాష, గోరుకంటి మధు కిషోర్, ముల్లంగి హస్మిత, జి.వేణుగోపాల్ రెడ్డి, డి.సువర్చల, దాసరి వంశి, ఎమ్. నాగషాయన, రాజ సుహాని, ఎమ్.మహిమకుమారి, ఎ.ఆర్.సాయినాథ్, ఆరంగుల శివకీర్తి, ఎమ్.గుణప్రియలు విజేతలుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హనుమంతరావు, జిల్లా సైన్స్ అధికారి రంగమ్మలు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి 24 మంది ఎంపిక