దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
ఏడీఆర్‌ఎం ఎడ్విన్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సంఘ కార్యా లయంలో అంతర్జాతీయ దింవ్యాంగ దినోత్సవం జరిగింది. ముఖ్యఅతిథి ఏడీఆర్‌ఎం పీఈ ఎడ్విన్ జ్వోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం, సౌకర్యం కోసం భారతీయ రైల్వే ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. దివ్యాంగ ప్రయాణికుల కోసం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. విజయవాడ డివిజన్‌లో దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధ్యానం ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన డివిజన్‌లో దృష్టిలోపం ఉన్న ఒక ఉద్యోగికి రెండు రోజుల్లో క్వార్టర్స్ కేటాయించాలని పర్సనల్ బ్రాంచ్ అధికారులను ఆదేశించారు. అనంతరం అసోసియేషన్ కార్యాలయం నుంచి ఉద్యోగులు రైల్వేస్టేషన్, రైల్వే హాస్పిటల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. సీనియర్ డీపీఓ ప్రేమ్‌కుమార్ లకావత్, రైల్వే హాస్పిటల్ సీఎంఎస్ డాక్టర్ ఎ.వి.ఎస్.కె ప్రసాద్, సీనియర్ డీఎంఈ సంజయ్ అంతోతు, సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.


