జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
నాగాయలంక: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన బేస్‌బాల్ పోటీల్లో తమ విద్యార్థినులు ఇద్దరు, స్విమ్మింగ్‌లో మరొకరు రాష్ట్రస్థాయిలో సత్తాచాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ హెచ్‌ఎం అలపర్తి సత్యనారాయణ, పీడీ గాజుల లక్ష్మీప్రసాద్ బుధవారం తెలిపారు. గత నెల 27, 28, 29 తేదీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం జిల్లా ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రాష్ట్రస్థాయి అండర్–17 బేస్‌బాల్ టోర్నీలో సత్తాచాటిన తమ్ము అనూష, పి.వల్లిశ్రీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక య్యారని పేర్కొన్నారు. వీరు జనవరిలో న్యూఢిల్లీలో జరిగే నేషనల్ బేస్‌బాల్ పోటీల్లో రాష్ట్రం తరఫన పాల్గొంటా రని పేర్కొన్నారు. నరస రావుపేటలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో తమ విద్యార్థిని నాగిడి అశ్వని రజత పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ందని పేర్కొన్నారు. అశ్వని ఈ నెల 14 నుంచి కోల్‌కతాలో జరిగే పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను పాఠశాల విద్యాకుటుంబం బుధవారం అభినందించింది.


