
వంతెన నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష
చిలకలపూడి(మచిలీపట్నం): పెనమలూరు మండలం పోరంకిలో బందరు కాలువపై వంతెన నిర్మాణానికి సంబంధించి అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సమీక్షించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ బాలాజీ బంద రులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోరంకి వద్ద బందరు కాలువపై వంతెన నిర్మాణం గురించి సమీక్షించారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సమీ పంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆయన చర్చించారు. బందరు కాలువ కట్టపై ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, భూసేకరణ, పరిహారం, నిర్మాణానికి పట్టే సమయం తదితర అంశాలపై అధికారులతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఉయ్యూరు ఆర్డీఓ బి.ఎస్.హేలా షారోన్, ఇరిగేషన్ ఎస్‌ఈ మోహన్‌రావు, రహదారులు భవనాలు ఎస్‌ఈ భాస్కరరావు, ఈఈ లోకేష్, కంకిపాడు తహసిల్దార్ గోపాలకృష్ణ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.