ఎండీయూలకు స్వస్తి.. రేషన్‌ కోసం కుస్తీ! | - | Sakshi
Sakshi News home page

ఎండీయూలకు స్వస్తి.. రేషన్‌ కోసం కుస్తీ!

May 19 2025 7:33 AM | Updated on May 19 2025 7:33 AM

ఎండీయ

ఎండీయూలకు స్వస్తి.. రేషన్‌ కోసం కుస్తీ!

ఇబ్రహీంపట్నం: రేషన్‌ కార్డుదారుల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరుస్తున్న మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) వాహనాల సేవలకు ప్రభుత్వం త్వరలో మంగళం పాడనుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే బియ్యం కార్డుల లబ్ధిదారులు పనులు మానుకుని, తమ ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్‌ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఎండీయూ వాహనదారులు, రేషన్‌ దుకాణదారులతో విజయవాడలో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు. రేషన్‌ పంపిణీలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని ప్రకటించారు. రేషన్‌ పంపిణీపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ పరిణామాలతో ఎండీయూ వాహనాలకు మంగళం పాడనున్నట్లు తేటతెల్లమవు తోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఐదేళ్ల పాటు ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీ సక్రమంగా సాగింది. ఇప్పుడు ఈ వ్యవస్థను నిలిపి వేసేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ఎండీయూ వాహనాలను నిలిపివేస్తే మైలవరం నియోజకవర్గంలో సుమారు 84,788 మంది రేషన్‌ కార్డుదారులు, 52 మంది ఎండీయూ వాహనదారులకు ఇబ్బందులు తప్పవు.

2027 జనవరి వరకు అగ్రిమెంట్‌

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాహనం ఏ వీధికి వస్తుందో ముందుగానే తెలియజేయడంతో లబ్ధిదారులు ఇంటి వద్ద ఉండి రేషన్‌ సరుకులు తీసుకునేవారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ఈ విధానం సౌకర్యవంతంగా ఉండేది. గత ప్రభుత్వ చేసుకున్న అగ్రిమెంట్‌ మేరకు 2027 జనవరి వరకు ఎండీయూ వాహన వ్యవస్థ కొనసాగాల్సి ఉంది. వాహనాలకు బీమా ప్రీమియం చెల్లిస్తామని, అప్పటి వరకు కొనసాగించాలని వాహనదారులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదని సమాచారం.

ఎండీయూ వాహనాల తొలగింపునకు కసరత్తు

కూటమి ప్రభుత్వం తిరిగి రేషన్‌ డీలర్ల ద్వారా ప్రజలకు రేషన్‌ సరుకులు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతోందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం త్వరలోనే నూతన విధానాన్ని అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్‌ విజయవాడలో వాహనదారులు, డీలర్లతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఎండీయూ వాహనాల రద్దు ప్రతిపాదన వస్తుందని తెలుస్తోంది. ఎండీయూ వాహనాల వ్యవస్థను రద్దు చేస్తే రేషన్‌ డీలర్ల వద్దకు వెళ్లి కార్డులు లైన్‌లో పెట్టి పడిగాపులు కాయాల్సి వస్తుందని వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎండీయూ వాహనాలకు ప్రభుత్వం మంగళం

డీలర్లతో రేషన్‌ సరుకుల పంపిణీకి కసరత్తు

నిలిచిపోనున్న ఇంటింటికీ రేషన్‌ పంపిణీ

ఆందోళనలో ఎండీయూ వాహనదారులు, కార్డుదారులు

ఇంటి వద్దే రేషన్‌ ఇవ్వాలి

ఎండీయూ వాహనం ద్వారా ఇప్పటి వరకు ప్రతినెలా ఇంటి వద్దనే రేషన్‌ బియ్యం తీసుకుంటున్నా. ఇక నుంచి ఇంటి వద్దకు వాహనం రాదనే ప్రచారం జరుగుతోంది. ఎండీయూ వాహనాలను రద్దు చేస్తే రేషన్‌ దుకాణం వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి. ఇంటికి దూరంగా ఉన్న రేషన్‌ దుకాణానికి వెళ్లి బియ్యం తెచ్చుకోవాలంటే ఇబ్బందులు తప్పవు.

– సెశెట్టి ఈశ్వరి, గృహిణి, కొండపల్లి

సరుకుల కోసం పని మానుకోవాలి

ఎండీయూ వాహనాలను తొలగించాలని ఆలోచన చేయడం బాధాకరం. ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్‌ దుకాణాలకు దివ్యాంగులు, వద్ధులు, మహిళలు వెళ్లి రేషన్‌ తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడా ల్సిందే. షాపుల వద్దకు వెళ్తే సరుకుల కోసం ఒక రోజు పని మానుకోవాల్సి వస్తుంది. ఇంటింటి రేషన్‌ పంపిణీపై ప్రభుత్వ పునరాలోచించాలి.

– కంతేటి అగ్నేసమ్మ, కిలేశపురం

ఎండీయూలకు స్వస్తి.. రేషన్‌ కోసం కుస్తీ! 1
1/2

ఎండీయూలకు స్వస్తి.. రేషన్‌ కోసం కుస్తీ!

ఎండీయూలకు స్వస్తి.. రేషన్‌ కోసం కుస్తీ! 2
2/2

ఎండీయూలకు స్వస్తి.. రేషన్‌ కోసం కుస్తీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement