తాడేపల్లిరూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయంలో జాతీయస్థాయి మేనేజ్‌మెంట్ ఉత్సవాన్ని(బిజినెస్ స్కూల్ ఫెస్ట్) ‘ట్రాక్ష్యా’ అనే అంశంతో శుక్రవారం నిర్వహించనున్నట్లు ఎంబీఏ విభాగ అధిపతి డాక్టర్ కె.హేమదివ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంగా ట్రాక్ష్యాను నిర్వహిస్తున్నామని, ఈ ఫెస్ట్‌కు ముఖ్య అతిథిగా టెక్ మహేంద్రా దక్షిణ భారతదేశ అధిపతి శ్రీనివాసరెడ్డి, గౌరవ అతిథిగా ఎంటర్‌ప్రెన్యూర్ విజయరాఘవులు విచ్చేయనున్నారని వివరించారు. ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్నోవేషన్ వంటి అంశాల్లో నైపుణ్యాలను, ప్రతిభను ప్రదర్శించడానికి విద్యార్థులకు ఇది అద్భుత అవకాశమని పేర్కొన్నారు. కేఎల్‌యూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి. పార్థసారథి వర్మ పాల్గొన్నారు.
నేడు ధర్మజ్యోతి
పురస్కారాల ప్రదానం
పాత గుంటూరు: బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నమయ్య కళావేదికపై స్వధర్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ధర్మజ్యోతి 2023 పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కొరప్రాటి రామారావు, తూనుగుంట్ల సుందరరామయ్య తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే సభలో గుమ్మడి రమేష్ చంద్ర పురస్కారాన్ని స్వీకరించనున్నట్లు వారు పేర్కొన్నారు.