
యూరియా కోసం రైతుల రాస్తారోకో
రెబ్బెన: పీఏసీఎస్‌కు వచ్చిన యూరియా పంపిణీకి టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు రోజులుగా పీఏసీఎస్‌కు వ స్తున్నా ఒక్క బస్తా యూరియా కూడా దొరకడంలేదన్నారు. ముందు రోజు జారీ చేసిన టోకెన్లకు యూ రియా పంపిణీ చేస్తున్నారన్నారు. శనివారం ఉద యం వచ్చిన యూరియా లోడ్‌కు సంబంధించిన టోకెన్లయినా జారీ చేయాలని కోరగా వ్యవసాయ అధికారులు నిరాకరిస్తున్నారన్నారు. పనులు వది లేసి రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దక్కకపోతే పంటలను ఎలా కాపాడుకోవాలని ప్ర శ్నించారు. స్పందించిన అధికారులు టోకెన్లు జారీ చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.