
పేరుకుపోతున్న చెత్తాచెదారం
అధికారులు పర్యవేక్షించాలి
శానిటేషన్ అధికారులు నిత్యం పట్టణంలో పర్యవేక్షించాలి. కార్మికుల పనితీరు, కాలనీల్లో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. వర్షాకాలం ముఖ్యంగా దోమల బెడద విపరీతంగా ఉంటుంది. ఫాగ్ మిషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. చెత్తను తొలగించే వాహనాల సంఖ్య పెంచాలి.
– మంథెన సదాశివ్, ఆసిఫాబాద్
ప్రజల సహకారం అవసరం
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణా రైసింగ్ 2047 లక్ష్యంగా జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు వంద రోజుల పాటు మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రతీరోజు కాలనీల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నాం. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛ ఆసిఫాబాద్‌కు ప్రజల సహకారం ఎంతో అవసరం.
– గజానంద్, మున్సిపల్ కమిషనర్, ఆసిఫాబాద్
● స్వచ్ఛ ఆసిఫాబాద్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు ముమ్మరం
ఆసిఫాబాద్‌అర్బన్: నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఏడాదికాలం పూర్తయినా పారిశుద్ధ్య పనుల నిర్వహణ ఇంకా గాడిలో పడకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వర్షాకాలం సీజన్ ఆరంభం కావడంతో సీ జనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ దీపాల ఏర్పాటు అంతంత మాత్రంగానే ఉంది. డ్రెయినేజీలు పూర్తిగా చెడి పోవడంతో రోడ్లపైకి మురికి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. డ్రె యినేజీ వ్యవస్థ పూర్తిగా చెడిపోవడంతో చిన్నపా టి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
తడి, పొడి చెత్తపై చర్యలు కరువు
పట్టణంలో ప్రతీరోజు వాహనాల ద్వారా తొలగించే తడి, పొడి చెత్తను వేరువేరుగా తొలగించకపోవడంతో కాలనీల్లో చెత్త వాహనాలు వెళ్తున్న క్రమంలో తీవ్ర దుర్గందం వెదజల్లుతోంది. పలు కాలనీలకు ప్రతీరోజు చెత్త వాహనాలు రాకపోవడంతో ప్రజలు కాలనీలోని ముఖ్య కూడళ్ల వద్ద చెత్తను పడేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసిఫాబాద్ పట్టణంలో 4 ట్రాక్టర్లు, 5 స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కార్యాలయంలో122 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో కనీసం ఒక్క ఫాగింగ్ మిషన్ కూడా లేకపోవడం దురదృష్టకరం. పట్టణంలో ఒకవైపు వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా వాటిని కట్టడి చేసే నాథుడే లేడు. పాలకులు మారినా, అధికారులు మారినా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు నామమాత్రంగా కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం జూన్ 2 నుంచి ప్రారంభమైన రైసింగ్ 2047 లక్ష్యంగా చేపట్టిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికలోనైనా పారిశుద్ధ్యం, ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో వీధి దీపాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాత్రి సమయాల్లో పలు కాలనీలకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ఇటీవల ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన గజానంద్ పారిశుద్ద్యం నిర్వహణ, స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

పేరుకుపోతున్న చెత్తాచెదారం

పేరుకుపోతున్న చెత్తాచెదారం