
ఓటరు జాబితా అందుబాటులో ఉంచుకోవాలి
దహెగాం(సిర్పూర్): బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో)లు బూత్‌స్థాయి ఓటరు జాబి తా అందుబాటులో ఉంచుకోవాలని సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్‌వోలకు శిక్షణ ఇచ్చారు. సర్వేకు వెళ్లినప్పుడు ఓటర్లతో ఎలా మాట్లాడాలో వివరించారు. గ్రామానికి చెందిన ఓటరు ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడితే కుటుంబ సభ్యులకు ముందుగా నోటీ సు ఇచ్చిన వారం రోజుల తర్వాత పేరు తొలగించాలన్నారు. తహసీల్దార్ మునవార్ షరీ ఫ్, ఎలక్షన్ డీటీ జోగయ్య, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, డీటీ గణేశ్ పాల్గొన్నారు.