
‘మహిళా శక్తి’ పనులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పంచాయతీరా జ్ ఈఈ అజ్మెర కృష్ణతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థికా భివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రూ.5 కోట్ల ప్రత్యేక నిధులతో చేపడుతున్న భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది అక్టోబర్ చివరిలోగా పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసి, ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాలో నగదు జమచేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ గజానంద్, సంబంధిత అధికారులు ఉన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే