
శిథిలావస్థలో ‘ఈఎస్‌ఐ’
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ఈఎస్‌ఐ శిథిలావస్థకు చేరింది. దీంతో కూల్చివేయాలని ఉత్తర్వులు కూడా వచ్చాయి. ప్రభుత్వం, ఈఎస్‌ఐ కార్పొరేషన్ ఆస్పత్రికి స్థలం కేటాయించకపోవడం, ఇతర భవనానికి తరలించేందుకు చర్యలు తీసుకోకపోవడం, నిధులు మంజూరు చేయకపోవడంతో ఇంకా శిథిల భవనంలోనే కొనసాగుతోంది. సూపరింటెండెంట్‌తోపాటు నలుగురు వైద్యులు. 60 మంది సిబ్బంది ఉన్నారు. సూపరింటెండెంట్, వైద్యులు మంచిర్యాల, వరంగల్, ఇతర ప్రాంతాల నుంచి వారానికి రెండుసార్లు వస్తూ హాజరు వేసుకుని వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఆస్పత్రిని రామగుండం ఈఎస్‌ఐకు తరలించేందుకు సన్నాహాలు చేస్తుండడంతో.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు.