
మాజీ సీఎం రోశయ్యకు నివాళి
ఆసిఫాబాద్‌అర్బన్: మాజీ ముఖ్యమంత్రి రోశ య్య జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోశ య్య సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించారని తెలిపారు. ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారన్నారు. రాజకీయాల్లో నైతిక విలువల కు మారుపేరుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, అధికారులు పెద్దన్న, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.