
గర్భిణులకు కష్టాలు
లింగాపూర్: మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి దాదాపు 14 పంచాయతీల నుంచి రోగులు వస్తుంటారు. ప్రతిరోజూ దాదాపు 80 వరకు ఓపీ నమోదవుతుంది. అయితే ఆస్పత్రిలో రెగ్యులర్ డాక్టర్ లేరు. పీఎం జన్‌మన్‌లో విధులు నిర్వర్తించే వైద్యుడు వారం రోజులుగా రావడం లేదు. ఆయుష్ వైద్యాధికారి వనిత సిర్పూర్(యూ) పీహెచ్‌సీలో డిప్యూటేషన్‌పై పనిచేస్తోంది. డాక్టర్ లేకపోవడంతో సోమ, శుక్రవారాల్లో గర్భిణుల నుంచి నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్ రక్తనమూనాలు సేకరించి జిల్లా కేంద్రానికి పంపిస్తున్నారు. ఇక స్కానింగ్ కోసం గర్భిణులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు ప్రత్యేక వాహనాల్లో వెళ్తున్నారు. దూరభారంతో ఇబ్బందులకు గురవుతున్నారు.