
మెడికల్ బిల్లులు విడుదల చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలోని ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూటీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎటుకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మెడికల్ బిల్లుల విడుదలలో జాప్యం నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందారపు ప్రకాశ్, జాటోత్ సంతోష్, రేగళ్ల వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్ ఉన్నారు.