
సమష్టి కృషితోనే మెరుగైన ర్యాంకు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
● అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేత
ఆసిఫాబాద్: అధికారులు, సిబ్బంది సమష్టి కృషి తో తిర్యాణి ఆస్పిరేషనల్ బ్లాక్ జాతీయ స్థాయిలో ఐదు, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు సాధించిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపా రు. జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా అధికా రులు, తిర్యాణి మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సమీ క్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తిర్యా ణి ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకు సాధించడంతో క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, ఆశ కార్యకర్తలు, ఆయాల కృషి ఉందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంఘాలు, మహిళల రివాల్వింగ్ ఫండ్, గర్భిణులకు పోషకాహారం అందించడం, శారీరక, మానసిక ఎదుగుదల లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించడం, విద్యా రంగ అభివృద్ధి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు, భూ ఆధార్ కార్డుల జారీ వంటి అంశాల్లో వందశాతం అభివృద్ధి సాధించాలని ఆదేశించారు. అనంతరం జాతీయస్థాయి ర్యాంకు సా ధించడంలో కృషి చేసిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీఆర్‌డీవో దత్తారావు, డీఎంహెచ్‌వో సీతా రాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీపీవో భిక్షపతి, ఎంపీడీవో మల్లేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.