
వనమహోత్సవంలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాల, జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులతో కలి సి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందు కు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కాలుష్య నియంత్రణకు చెట్లు కాపాడుకోవడమే ఏకై క మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలకు కేటాయించి న లక్ష్యాన్ని పూర్తిచేయడం కోసం స్థలాలు గుర్తించా లని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి రామ్‌చందర్, డీఆర్‌డీవో దత్తారావు, డీటీడీవో రమాదేవి, డీఎస్‌వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, విద్యార్థులు పాల్గొన్నారు.