
జూన్.. సాధారణం
దహెగాం(సిర్పూర్): వర్షాకాలం ప్రారంభమైనప్ప టి నుంచి ఇప్పటికీ భారీ వర్షాలు కురవలేదు. అడపాదడపా కురుస్తున్న వానలతో జూన్‌లో సాధారణ సగటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది వానాకా లం సీజన్ ప్రారంభానికి కంటే ముందుగానే వర్షాలు పలకరించాయి. దీంతో జిల్లాలోని రైతులు మృగశిర కార్తెలోనే పత్తి విత్తనాలు విత్తడం ప్రారంభించారు. ఆ సమయంలో వారం రోజులపాటు వరుణుడి జాడ లేకపోవడంతో కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత చినుకులకు మొలకలు వచ్చాయి. మొలకెత్తని చేలలో కొందరు మళ్లీ కూలీలతో విత్తనాలు వేసుకున్నారు.
214.1 సగటు వర్షపాతం
జిల్లావ్యాప్తంగా జూన్‌లో 188.6 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. నెలాఖరు నాటికి 214.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, సుమారు 15 రోజుల్లో వర్షం పడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జైనూర్, సిర్పూర్(యూ), చింతలమానెపల్లి మండలాల్లో మాత్రం లోటు కనిపిస్తోంది. మరోవైపు ఐదు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, లింగాపూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, కెరమెరి, సిర్పూర్(టి)లో అధిక వర్షపాతం, వాంకిడి, కాగజ్‌నగర్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
వరిసాగు అంతంతే..
భారీ వర్షాలు లేక ప్రాజెక్టులు, చెరువుల్లో వరద నీరు చేరలేదు. దీంతో వరిసాగు పనులు ముందుకు సాగడం లేదు. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాలతోపాటు సిర్పూర్ నియోజకవర్గంలో వరి సాగు అధికంగా ఉంటుంది. ఇప్పటికే నారు మడులు సిద్ధం చేసుకోవాల్సి ఉండగా.. ఆ దిశగా పనులు సాగడం లేదు. భారీ వర్షాలు లేక ప్రధాన ప్రాజెక్టులు, చెరువుల ఆయకట్టు కింద రైతులు పనులు ప్రారంభించలేదు. పొలాలు బీళ్లుగా ఉన్నాయి. బోర్లు, బావుల నీటి సౌకర్యం ఉన్నవారు మాత్రం నారుమడులు సిద్ధం చేస్తున్నారు. పొలాల్లో మొలక అలుకుతున్నారు.
పత్తికి అనుకూలం
ఈ వానాకాలం సీజన్‌లో ఐదెకరాల్లో పత్తి సాగు చేసిన. ప్రస్తుతం మొక్క నాలుగు ఆకుల దశలో ఉంది. వర్షాలు పత్తి పంటకు అనుకూలంగా ఉన్నాయి. మొదట్లో వానలకు పత్తి మొలకెత్తని చోట మరోసారి విత్తనాలు పెట్టినం. అవి కూడా ఇప్పుడు మొలకెత్తాయి. డౌర కొట్టే సమయం వచ్చింది.
– నికాడి నారాయణ, రైతు, దహెగాం
15 వరకు పత్తి విత్తుకోవచ్చు
ఇప్పటికే జిల్లాలో 98 శాతం పత్తి వి త్తుకోవడం పూర్తయింది. జూలై 15 వరకు కూడా విత్తుకోవచ్చు. ఆగస్టు మొదటి వారం లోగా వరి నాట్లు పూర్తి చేసుకోవాలి. ఖర్చు తగ్గడానికి వరి విత్తనాలు వెదజల్లే పద్ధతిలో సాగు చేసుకుంటే మంచిది. 10 కిలోల వరి విత్తనాలు ఎకరానికి వేసుకోవచ్చు. డ్రమ్ సీడర్‌తో వేసుకుంటే పంట త్వరగా చేతికొస్తుంది.
– శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి
దహెగాం పెద్దచెరువు కింద బీళ్లుగా పొలాలు
జూన్ వర్షపాతం వివరాలు(మి.మీ.లలో)
మండలం కురువాల్సింది కురిసింది స్థితి
జైనూర్ 210.1 128.2 –39 లోటు
సిర్పూర్(యు) 193.4 162.7 –16 సాధారణం
లింగాపూర్ 187.7 259.9 39 అధికం
తిర్యాణి 167.1 133.4 –20 లోటు
రెబ్బెన 151.1 217.9 44 అధికం
ఆసిఫాబాద్ 173.4 251 45 అధికం
కెరమెరి 168.3 225 34 అధికం
వాంకిడి 198.1 342.7 73 అత్యధికం
కాగజ్‌నగర్ 169.6 294.8 74 అత్యధికం
సిర్పూర్(టి) 190.1 248.8 31 అధికం
కౌటాల 201 228.1 13 సాధారణం
చింతలమానెపల్లి 205.9 164.9 –20 లోటు
బెజ్జూర్ 216.5 198.4 –8 సాధారణం
పెంచికల్‌పేట్ 192.4 167.8 –13 సాధారణం
దహెగాం 204.4 186.4 –9 సాధారణం
ఏడు మండలాల్లో అధికం.. మూడు మండలాల్లో లోటు వర్షపాతం
ఇప్పటికీ భారీ వర్షాల జాడే లేదు..
చెరువులు, ప్రాజెక్టులోకి చేరని వరద
నెమ్మదిగా వరిసాగు
మొలక దశకు పత్తి..
వానాకాలం సీజన్ ప్రారంభ సమయంలో వర్షాలు ముఖం చాటేసినా.. ఆ తర్వాత పడిన వానతో జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగాయి. జిల్లాలో 4.45 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా.. అందులో ప్రధానంగా 3.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం పత్తి విత్తుకోవడం పూర్తయింది. పత్తి విత్తనాలు కూడా మొలకెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉండటంతో విత్తనాలు మొలకెత్తకపోవడంతో మరోసారి వేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పడుతున్న ముసురు వానలు పత్తి, సోయా వంటి పంటలకు మేలు చేస్తాయని రైతులు ఆశాభావం చేస్తున్నారు.

జూన్.. సాధారణం

జూన్.. సాధారణం