
ప్రవేశాలు, ఫలితాలపై దృష్టి
● డీఐఈవో కళ్యాణి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచడం, మెరుగైన ఫలితాలు సా ధించడంపై దృష్టి సారించామని జిల్లా మాధ్యమిక విద్యాధికారి(డీఐఈవో) కళ్యాణి అన్నా రు. కొన్నేళ్లుగా ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్, కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని, గతేడాది ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలవడం గర్వకారణమని పే ర్కొన్నారు. ఇటీవల పదో తరగతి సప్లింమెంటరీ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నామని, ప్రవేశాల పెంపు కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్నామని తెలిపారు. 2025– 26 విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కళాశాలల్లో వసతులు, ప్రవేశాల వివరాలు వెల్లడించారు.
సాక్షి: జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల తీరు ఎలా ఉంది. ఇప్పటివరకు ఎన్ని అడ్మిష న్లు వచ్చాయి?
డీఐఈవో: జిల్లాలో జూనియర్ కళాశాలలు 48 ఉండగా, ఇందులో ప్రభుత్వ కాలేజీలు 11, ప్రైవే ట్ 4, కేజీబీవీలు 13, బీసీ, ఎస్సీ, మైనార్టీ గు రుకుల కళాశాల మరో 20 వరకు ఉన్నాయి. 11 ప్రభుత్వ కళాశాలల్లో గతేడాది 2,535 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మూడు వేల సంఖ్యను చేరుకోవడమే లక్ష్యంగా అధ్యాపకులతో ఇంటింటికీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఫస్టియర్‌లో 1,198 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య మరింత పెరుగుతుంది.
సాక్షి: గత విద్యా సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించిన కళాశాలల్లోనూ ప్రవేశాల సంఖ్య తగ్గింది. దీనికి కారణాలేంటి?
డీఐఈవో: గతేడాది చాలా వరకు ప్రభుత్వ కాలేజీ మెరుగైన ఫలితాలు సాధించాయి. అయితే ప్ర భుత్వ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీ వీలు అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో విద్యార్థులు ఎక్కువ మంది అక్కడే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ కారణంతోనే గవర్నమెంట్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయి.
సాక్షి: 2025– 26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలి తాల సాధనకు ఎలాంటి ప్రణాళికలు అమలు చేయనున్నారు?
డీఐఈవో: గతేడాది ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా రెండోస్థానంలో నిలవగా, ఫస్టియర్ ఫలితాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. 2025– 26 విద్యా సంవత్సరంలో కూడా ఫలితాలు తగ్గకుండా ప్రత్యేక ప్రణా ళిక అమలు చేస్తాం. సకాలంలో సిలబస్ పూర్తి చేయడంపై దృష్టి సారిస్తాం. అధ్యాపకుల కొర త ఉన్న ఉర్దూ మీడియం కళాశాలల్లో ఒప్పంద పద్ధతిన లెక్చరర్లను నియమిస్తాం.
సాక్షి: ప్రభుత్వ కళాశాలల్లో వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీఐఈవో: కొన్ని కళాశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవు. రెబ్బెన కళాశాలలో 18 గదులకు 9 గదులు మాత్రమే ఉన్నాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఒకేచోట బోధిస్తున్నారు. ప్రహరీలు నిర్మాణం, మరమ్మతులు, అదనపు తరగతి గదులు నిర్మించాలని ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ ఏడాది అ ధ్యాపకుల కొరత లేదు. కళాశాలలకు తాజాగా ప్రభుత్వం రూ.10వేలు చొప్పున జమ చేసింది. మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది.

ప్రవేశాలు, ఫలితాలపై దృష్టి